ప్రధాని

ప్రధాని సభను విజయవంతం చేద్దాం

Published on: 📅 11 Oct 2025, 07:21

క‌ర్నూలులో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సూపర్ జిల్లాల సభను విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, సీఎంతో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. దీపావళి సందర్భంగా ఈ నెల 16 నుంచి 19 వరకు జిల్లా కేంద్రాలలో 'గ్రాండ్ జీఎస్‌టీ షాపింగ్ ఫెస్టివల్‌' నిర్వహించాలని లోకేశ్ ఆదేశించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్‌టీ 2.0 వల్ల ప్రజలకు కలిగే మేలును వివరిస్తూ గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు 98,985 అవగాహన కార్యక్రమాలు, 22,500 అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Sponsored