ఎన్నికలకు

ఎన్నికలకు వెళ్లాల్సింది మనం.. అధికారులు కాదు

Published on: 11-10-2025

ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా పెట్టుబడులు రావడానికి అనుగుణంగా మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి (సీఎం) అమరావతిలో జరిగిన సమావేశంలో ఆదేశించారు. 'ఎన్నికలకు వెళ్లాల్సింది మనం.. అధికారులు కాదు' అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రులకు సూచించారు. కంపెనీ ప్రతినిధులను నేరుగా కలిసి, పనులు వేగవంతం చేయాలని, డ్రైవింగ్ ఫోర్స్‌లా వ్యవహరించాలని నిర్దేశించారు. పెట్టుబడులకు ఆటంకాలు తొలగి, ప్రాజెక్టులు వేగంగా ప్రారంభమయ్యేలా చూడాలని, లేకపోతే వారు తమ శాఖలకు ఏమీ చేయలేరని ప్రజలు అనుకుంటారని సీఎం స్పష్టం చేశారు. మెరుగైన రాయితీలు ఇచ్చి, పోటీని తట్టుకుని రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు తీసుకురావాలని తెలిపారు.

Sponsored