తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాసినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీగా పేర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్పై కేసుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. విచారణ సమయంలో సాక్ష్యాలను తారుమారు చేశారని, అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి.. అమిత్‌షాకు కేటీఆర్ లేఖ
8
Published on: 📅 13 Mar 2026, 06:55 PM
Reporter: 🖊 Ramesh Kumar