ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు క్రికెట్ విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డి విలియర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్‌పై కీలక సూచనలు చేశాడు.
ధోని లాంటి అనుభవజ్ఞుడు 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం జట్టుకు పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నాడు. అతడు ఎక్కువ బంతులు ఎదుర్కొనేలా ముందుగానే క్రీజులోకి రావాలని సూచించాడు. కనీసం ఆరో స్థానంలో అయినా ధోని బ్యాటింగ్‌కు రావాలని, తన అభిప్రాయం ప్రకారం 4 లేదా 5 స్థానాల్లో ఆడితే మరింత ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు.
ఇక టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలను పక్కనపెట్టి, జస్ప్రీత్ బుమ్రానే బెస్ట్ టీ20 క్రికెటర్‌గా ఎంపిక చేశాడు.
బుమ్రా బౌలింగ్‌లో ఉన్న ప్రత్యేకత అతడిని మిగతావారితో పోల్చితే ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పాడు. కొత్త బంతితోనూ, డెత్ ఓవర్లలోనూ సమానంగా ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ముఖ్యంగా సూపర్ ఓవర్ వంటి ఒత్తిడి పరిస్థితుల్లో కూడా మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం అతడికి ఉందని వివరించాడు.
మొత్తంగా చూస్తే, ధోని బ్యాటింగ్ స్థానం మార్పు చెన్నై జట్టుకు కీలకంగా మారవచ్చని, బుమ్రా వంటి బౌలర్ టీ20 క్రికెట్లో గేమ్‌చేంజర్ అని డివిలియర్స్ విశ్లేషించాడు
ధోనీ బ్యాటింగ్‌పై కీలక వ్యాఖ్యలు… బుమ్రానే గొప్ప టీ20 ప్లేయర్: డివిలియర్స్
6
Published on: 📅 18 Mar 2026, 11:52 AM
Reporter: 🖊 Ramesh Kumar