ఇల్లు

ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.2.90లక్షలు ఇస్తారు, పూర్తి వివరాలివే

Published on: 17-09-2025

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అర్బన్ 2.0 కింద 40,410 ఇళ్లను మంజూరు చేసింది. 2024-25 సంవత్సరానికి 31,719 ఇళ్లు, 2025-26కు మరో 8,691 ఇళ్లను కేటాయించింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో యూనిట్‌ (ఇంటి) విలువ రూ.2.50 లక్షలు కాగా.. ఇందులో కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష భరిస్తుంది. పేద ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు.

Sponsored