ఆసియా

ఆసియా కప్‌లో నేడు టఫ్ ఫైట్.. బంగ్లాదేశ్ ఓడితే ఇక ఇంటికే!

Published on: 16-09-2025

ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగింపునకు వచ్చాయి. గ్రూప్ ఏ నుంచి భారత్ సూపర్ 4కి వెళ్లగా.. గ్రూప్ బీలో ఇప్పటి వరకూ ఏ జట్టూ వెళ్లలేదు. శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించగా.. అప్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ గెలవగా, బంగ్లా రెండింటిలో ఒకదాంట్లో విజయం సాధించింది. ఇక హాంకాంగ్ జట్టు మూడింటిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే, ఆసియా కప్‌లో ఇవాళ బంగ్లాదేశ్ - అప్ఘనిస్తాన్ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.

Sponsored