Ghaati:

Ghaati: ఇది కరెక్ట్ కాదు స్వీటీ.. ‘ఘాటి’ని టెన్షన్ పెడుతోన్న అనుష్క!

Published on: 28-08-2025

సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న ఘాటీ ప్రమోషన్లలో అనుష్క శెట్టి పాల్గొనబోరని నిర్మాత రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే ఉన్న టర్మ్స్ ప్రకారం ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా వీడియో ఇంటర్వ్యూల్లో కనిపించే అవకాశం లేదన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలో నవీన్ పోలిశెట్టి ఒంటరిగా ప్రమోషన్లను మోయగా, ఘాటీలో హీరో విక్రమ్ ప్రభు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా పాపులర్ కాకపోవడం వల్ల ఆ లోటు మరింత స్పష్టమవుతుందని అంటున్నారు. దీంతో ప్రమోషన్ల భారమంతా డైరెక్టర్ క్రిష్ మీదే పడింది.

Sponsored