42

42 శాతం రిజర్వేషన్ల సాధనకు నిరాహార దీక్షా సదస్సు

Published on: 📅 14 Oct 2025, 03:51

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు నిరాహార దీక్షా సదస్సు నిర్వహిస్తున్నామని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద దీక్షా సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితిని ఏర్పాటు చేశామన్నారు. రిజర్వేషన్ల సాధనకు లక్ష మందితో సభ నిర్వహిస్తామని మాజీ ఐఏఎస్ అధికారి టి.విజయ్‌కుమార్ తెలిపారు.

Sponsored