అమెరికా

అమెరికా రహస్యాలు చైనాకు.. భారతీయ మూలాలున్న వ్యక్తి అరెస్టు!

Published on: 📅 15 Oct 2025, 09:01

NRI

భారతీయ మూలాలున్న ప్రముఖ అమెరికన్ వ్యూహాత్మక నిపుణుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు ఆష్లీ జె. టెల్లిస్ రహస్య పత్రాలను అక్రమంగా తన వద్ద ఉంచుకున్నాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. పెంటగాన్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన టెల్లిస్ ఇంట్లో వెయ్యికి పైగా 'టాప్ సీక్రెట్' డాక్యుమెంట్లు లభించాయి. అంతేకాక, ఆయన చైనా అధికారులతో అనేకసార్లు సమావేశమయినట్లు కూడా ఫెడరల్ దర్యాప్తులో తేలింది. ఈ జాతీయ భద్రతా సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఉంచుకున్నందుకు టెల్లిస్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే, అతనికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. ఈ కేసు అమెరికా పాలసీ వర్గాల్లో కలకలం సృష్టించింది.

Sponsored