జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఏనాడూ కన్నీరు పెట్టని ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించినప్పుడు మాత్రం వెక్కి వెక్కి ఏడ్చారని తెలిపారు సూపర్‌స్టార్ రజినీకాంత్ . సినీ రంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లయిన సందర్భంగా చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఇళయరాజాకు తమిళనాడు ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరై ఇళయరాజాతో తమకున్న అనుబంధం గురించి ప్రసంగించారు. ఈ సందర్బంగా రజినీ మాట్లాడుతూ... ఎస్పీ బాలు మరణం ఇళయరాజాను ఎంతగానో కలచివేసిందన్నారు.
భార్య, కుమార్తె చనిపోయినా చలించలేదు.. బాలు మరణంతో వెక్కి వెక్కి ఏడ్చాడు
Published on: 15-09-2025