రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఈక్యూటీ గ్రూప్ భారీ బిడ్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మార్చి 16 వరకు బిడ్లు స్వీకరించనుండగా, మార్చి చివరికి విక్రయ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ ఆధీనంలో ఉన్న ఆర్సీబీపై అదార్ పూనావాలా, రంజన్ పాయ్ తదితరులూ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా ఆర్సీబీ మరోసారి వార్తల్లో నిలిచింది
ఆర్సీబీ అమ్మకానికి మళ్లీ హీట్.. ఈక్యూటీ భారీ బిడ్‌కు సిద్ధం
6
Published on: 📅 14 Mar 2026, 11:16 AM
Reporter: 🖊 Anitha Sharma