భారీ

భారీ వర్షాలతో 2 లక్షల 20 వేల ఎకరాల్లో పంట నష్టం.. ఆ జిల్లాలో ఊహించని విధంగా

Published on: 30-08-2025

తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. మొత్తం 28 జిల్లాల్లోని సుమారు 2.2 లక్షల ఎకరాల పంట నష్టపోయినట్లు.. 1.4 లక్షల మంది రైతులు ప్రభావితులయ్యారని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా మునిగిపోయాయి. ఈ భారీ వర్షాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Sponsored