Facial recognition mandatory for students and teaching staff: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్‌ను తప్పనిసరి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లులను త్వరగా చెల్లించాలని.. అన్ని విద్యా సంస్థల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల నిర్మాణం ఒకే విభాగం కిందకు తీసుకురావడం ద్వారా నాణ్యతను పెంచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
విద్యారంగంలో భారీ మార్పులు.. పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం..
Published on: 30-08-2025