చిరంజీవికి

చిరంజీవికి సర్జరీ.. టీమ్ ఎందుకు దాస్తోంది

Published on: 📅 05 Jan 2026, 03:12

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానుల్లో ఎనర్జీ ఉప్పొంగుతుంది. 60 ఏళ్లు దాటినా యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన స్టైల్, గ్రేస్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా, తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం, మెగాస్టార్‌కు ఇటీవల ఒక చిన్న సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ వైద్య ప్రక్రియేనని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆయన మళ్లీ తన కార్యక్రమాల్లో పాల్గొననున్నారని టాక్.

Sponsored