రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రాజెక్టు పనులు నిలిపివేతపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తాను మాట్లాడినట్టు రేవంత్ తెలిపారు.ఈ వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.