రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారులతో సామూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక లేఖలు లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతోంది.
ఉగాది కానుకగా 2.5 లక్షల గృహప్రవేశాలు
5
Published on: 📅 11 Mar 2026, 01:12 PM
Reporter: 🖊 Anitha Sharma