హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో బస్సు సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేసి, వారిని వెంటనే కిందకి దించేశారు. ఈ ప్రమాదం జరగకుండా తప్పింది. ఈ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.