బాలీవుడ్

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు

Published on: 11-11-2025

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా పేరుపొందిన ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ధర్మేంద్రను అప్పటి కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. ఆయన 1997లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.బాలీవుడ్‌లో "హీ-మ్యాన్"గా ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర, 'షోలే', 'సీతా ఔర్ గీతా' వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన సినీ ప్రయాణం ఆరు దశాబ్దాలకు పైగా సాగింది.

Sponsored