ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. కర్ణాటక తర్వాత దేశంలో రెండో ప్లేసు మనదే..

Published on: 📅 11 Aug 2025, 08:56

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది. ప్రజలకు వేగంగా న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరును కనబరిచినట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభద్రతలు, న్యాయవ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 రూపొందించారు.

Sponsored