అంబటి

అంబటి రాంబాబు సతీమణి హైకోర్టులో హౌస్ మోషన్

Published on: 📅 01 Feb 2026, 06:22

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. 24 గంటలపాటు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీడీపీ కార్యకర్తలు ఆయన నివాసంపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.

Sponsored