బేతంచర్ల-కాజా మధ్య యాక్సెస్ కంట్రోల్ కారిడార్ రహదారిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అభివృద్ధి చేయనుంది. బాపట్ల జిల్లా మద్దీరమ్మ నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు 100 కి.మీ. మార్గాన్ని ఆరు వరుసల నుండి యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా మారుస్తారు. బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ కారిడార్ భాగంగా, శ్రీ సత్యసాయి జిల్లాలో NH-44 లోని కోడికొండ నుండి బాపట్ల జిల్లాలో NH-16 లోని మువ్వరం వరకు 342 కి.మీ. మేర కొత్త రహదారి నిర్మిస్తున్నారు. ఈ కొత్త రహదారి మువ్వరం వద్ద NH-16 లో కలుస్తుంది, దీనివల్ల NH-16పై రద్దీ పెరుగుతుంది.