కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మృతిచెందారు. మంత్రి మండీపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది తనను బాధించిందని అన్నారు. ఆయన హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.