బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని తెలిపారు. తన స్వార్థం కోసం వెళ్లినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కార్యకర్తలకు బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారని, పేద ప్రజల పిల్లల కోసం అడుగుతూ రాత్రులు గడిపానని అన్నారు. నిధుల కోసం సీఎంను కలిస్తే కొంత వరకు ఇచ్చారని, ప్రభుత్వ సహకారం లేకపోతే నిధులు రావని వివరించారు. తాను సాంకేతికంగా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నానని పేర్కొంటూ, ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు.
స్వార్థం కోసం సీఎం వద్దకు వెళ్ళినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: పోచారం
Published on: 24-10-2025