అమెరికాలో

అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య

Published on: 📅 06 Oct 2025, 12:01

NRI

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారి సురేష్ భాయ్ (51) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన కెంటకీలోని లూయిస్‌విల్లే నగరంలో జరిగింది. ఆయన కిరాణా దుకాణం నడుపుతున్నారు. దుకాణంలోకి వచ్చిన కొందరు దుండగులు డబ్బులు దోచుకెళ్లడానికి యత్నించి, సురేష్‌పై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Sponsored