ప్రస్తుత కార్తీకమాసంలో తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులలో స్నానాలు చేసే భక్తుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండటంతో నదీస్నానాలకు వెళ్లేవారి సంఖ్య మరింత పెరిగింది.ఈ నదీస్నానాలు, దైవ దర్శనాల కోసం ప్రజలు బంధుమిత్రులతో కలిసి యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలు, స్నానాలు చేసే సమయంలో భక్తులందరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.