మంత్రి

మంత్రి లోకేశ్‌కు 'టీమ్‌ ఇండియా' బహుమతి

Published on: 13-10-2025

మంత్రి నారా లోకేశ్‌కు టీమ్ ఇండియా క్రీడాకారులు సంతకాలు చేసిన టీ-షర్టును బహుమతిగా అందించారు. ఏపీసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆసీస్ మహిళా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన లోకేశ్‌కు, అసియా కప్‌కు టీమ్ ఇండియా జట్టు మేనేజర్‌గా వ్యవహరించిన పి.వి.ఆర్. ప్రశాంత్ ఈ టీ-షర్టును ఇచ్చారు. ఆసియా కప్‌ గెలుచుకున్న ఆటగాళ్ల సంతకాలతో ఉన్న టీ-షర్టును చూసి లోకేశ్ తనయుడు దేవాన్ష్ మురిసిపోయాడు. ప్రశాంత్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు కుమారుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు.

Sponsored