రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్ణకుంభం, వేదమంత్రాల మధ్య ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో ఏడు ఫ్లోర్లలో (G+7) సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. ఇందులోనే రాష్ట్రీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం పక్కన మొత్తం 8 ఎకరాల్లో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సీఆర్డీఏ భవనంలోని మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.