ఏడేళ్ల

ఏడేళ్ల నాటి ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి: పవన్ కల్యాణ్

Published on: 13-10-2025

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకాకుళం యువత మాటలను గుర్తు చేసుకున్నారు. 'మాకు ఉచితాలు కాదు... పాలసీకి భవిష్యత్తు ఇవ్వండి' అని 2018లో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించినప్పుడు వారు కోరారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ X వేదికగా పంచుకోగా, పవన్ కల్యాణ్ స్పందించారు. "ఆ సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. వారు ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు. మంచి భవిష్యత్తును అడిగారు. వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి. యువత ఆకాంక్షల్ని నెరవేర్చడానికి నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాను" అని ఆయన పేర్కొన్నారు.

Sponsored