ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలిదశ శాంతి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా హమాస్ నేడు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు బయలుదేరే ముందు, గాజాలో యుద్ధం ముగిసింది అని ప్రకటించారు. ఇకపై పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు. బందీల విడుదలకు బదులుగా, ఇజ్రాయెల్ 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ట్రంప్ మొదట పార్లమెంట్‌లో ప్రసంగించి, ఆ తర్వాత బందీల కుటుంబ సభ్యులను కలవనున్నారు. అనంతరం ఈజిప్ట్‌లో జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు.