బీసీ

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Published on: 08-10-2025

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. అయితే, 2011 జనాభా ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది.

Sponsored