వైద్య

వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించాలి

Published on: 08-10-2025

హైదరాబాద్‌లోని డీవీవీ, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ముఖ్యంగా బస్తీ దవాఖానా సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయని తెలిపారు. తక్షణమే స్పందించి వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sponsored