హైదరాబాద్‌లో నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్న కేసులో యోహాను అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్ర భారతిలో పలువురికి సర్టిఫికెట్లు అందిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో డబ్బులు తీసుకుని యోహాను ఈ సర్టిఫికెట్లను సాహిత్యం, కళలు వంటి విభాగాల్లో ఇస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.