సౌదీ అరేబియా ప్రధాన ముఫ్తీ, శేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ మహ్మద్ ఆల్‌షేఖ్ మరణించారు. ఆయన దీర్ఘకాలంగా సౌదీ ధార్మిక వ్యవహారాల విభాగానికి సేవలందించారు. సౌదీ రాజ కుటుంబానికి ప్రధాన మత సలహాదారుడిగా వ్యవహరించిన ఆయన, ఇస్లామిక్ చట్టాల అమలులో కీలక పాత్ర పోషించారు. 1999లో ముఫ్తీగా నియమితులైన ఆయన అనేక మత, సామాజిక నిర్ణయాలలో ప్రాముఖ్యత పొందారు. అంతర్జాతీయ వేదికలపై కూడా సౌదీ అభిప్రాయాలను ప్రతిబింబించారు. ఆయన మరణం సౌదీ ధార్మిక వర్గాలకు, దేశ రాజకీయ-మత వ్యవస్థకు పెద్ద లోటు అని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.