అమెరికా

అమెరికా టూర్ కల.. 3 నిమిషాల్లో చెదిరింది: కస్టమ్స్ అధికారి పోస్ట్ వైరల్

Published on: 20-09-2025

NRI

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పర్యటన కోసం ప్రయత్నించిన భారత కస్టమ్స్ అధికారి ఒక చిన్న తప్పు కారణంగా వీసా రిజెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూలో అనుకోకుండా చెప్పిన తప్పుడు సమాధానం వల్ల సమస్య ఏర్పడింది. ఆయన లాస్ఏంజిల్స్‌కి వెళ్లబోతోన్నట్లు చెప్పబోయి తప్పుగా శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పారు. మూడు నిమిషాల్లోనే వీసా రద్దు చేయబడింది. ఈ సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, వీసా ఇంటర్వ్యూలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నెట్టింట చర్చకు కారణమైంది. కస్టమ్స్ అధికారిగా స్థిర ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల పైగా పొదుపు ఉన్నప్పటికీ వీసా రద్దు అయ్యిందని ఆయన వెల్లడించాడు.

Sponsored