మంగళవారం సచివాలయంలో కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన సమయంలో ఛాతి నొప్పితో కూలిపోవడంతో వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండగా, కాంగ్రెస్ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు వైద్య సదుపాయాలు అందిస్తున్నాయని వెల్లడించాయి.