హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న వారికి రేవంత్ సర్కార్ దసరా కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నగర వాసులు చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న రూ.5కే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ నెలాఖరు లేదా దసరా పండుగ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభిచనున్నట్లు అధికారులు తెలిపారు.