ప్రేమని అడ్డంగా బుక్ చేసేసింది శ్రీవల్లి. ప్రేమ.. కళ్యాణ్ గాడ్ని తరుముతున్న ఫొటో పేపర్‌లో పడటంతో దాన్ని తెచ్చి రామరాజు చేతిలో పెట్టింది శ్రీవల్లి. దాంతో రామరాజు.. ‘ఎవడాడూ..నువ్వెందుకు తరుముతున్నావ్’ అని నిలదీయడాన్ని నిన్నటి ఎపిసోడ్‌లో చూశాం. ఇక ఈరోజు (సెప్టెంబర్ 12) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ‘మామయ్య అడుగుతుంటే చెప్పవేంటి ప్రేమా.. దేవుడు లాంటి మామయ్య గారిని అవమానించడం కరెక్ట్ కాదు కదా.. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా మామయ్య గారండీ’ అని అంటుంది శ్రీవల్లి. అబ్బే నీ తప్పే లేదమ్మా.. అని అన్నగొర్రెమామ రామరాజు.