యాదగిరిగుట్టకు

యాదగిరిగుట్టకు వెళ్తున్నారా..? అయితే ఆ రోజు వెళ్లకండి.. దర్శనాలు అన్నీ బంద్..

Published on: 05-09-2025

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒక రోజు మూసివేయనున్నారు. ప్రతీ రోజు వేల సంఖ్యలో దర్శనానికి వచ్చే ఈ ఆలయం సెప్టెంబర్ 7వ తారీఖున మూతపడనుంది. చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గ్రహణానికి ముందు రోజు అంటే సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటల వరకే పూజలు, వ్రతాలు జరుగుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ యాత్రా ప్రణాళికలను సవరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆలయ అధికారులను సంప్రదించవచ్చు.

Sponsored