కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ నటించిన మలయాళ చిత్రం 'కొత్త లోక 1: చంద్ర' సంచలనం సృష్టిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో విడుదల చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఇతర భాషల సినిమాలతో పోల్చి తెలుగు సినిమాలను విమర్శిస్తున్నారని అన్నారు.