రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా మైసూర్ లో భారీ మాస్ సాంగ్ షూట్ మొదలైంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో 1000 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ దీనికి ఓ మాస్ డ్యాన్స్ బీట్ కంపోజ్ చేసినట్లు సమాచారం. రహమాన్ డప్పు, చరణ్ స్టెప్పులతో పాట అదిరిపోతుందని బుచ్చిబాబు తెలిపారు.
Peddi Song: జానీ మాస్టర్‌కి మరో ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్.. 1000+ మంది డ్యాన్సర్లతో ‘పెద్ది’ సాంగ్ షూట్..
Published on: 28-08-2025