OG:

OG: ‘సువ్వి సువ్వి’ కూడా కాపీయేనా.. తమన్‌పై మళ్లీ ట్రోలింగ్ షురూ!

Published on: 28-08-2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి సందర్బంగా ‘సువ్వి సువ్వి’ అంటూ సాగే మెలోడీ లిరిక్ సాంగ్‌ని వదిలారు. ఈ సాంగ్ అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అంటుంటే.. తమన్ కాపీ కొట్టాడంటూ సోషల్‌మీడియాలో కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Sponsored