రేవంత్

రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు.. కీలక హామీ ఇచ్చిన సీఎం..

Published on: 25-08-2025

టాలీవుడ్ సినీ కార్మికులు 18 రోజుల తర్వాత సమ్మె విరమించారు. సమ్మె విరమణకు చొరవ తీసుకొని పరిష్కారం చూపించిన సీఎం రేవంత్ రెడ్డిని సినీ నిర్మాతలు, దర్శకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. నైపుణ్యాల అభివృద్ధికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామని చెప్పారు. సినీ కార్మికులను నిర్మాతలు మానవత్వంతో చూడాలని సూచించారు. పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Sponsored