ఈటీవీ 30 ఇయర్స్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి-బ్రహ్మానందం కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన వీడియో, మెగాస్టార్‌తో బ్రహ్మీ చేసిన కామెడీ వీడియో చూసి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎప్పటికీ చిరు-బ్రహ్మీ కాంబో సూపర్ అంటున్నారు. ఛానల్ స్థాపించి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకకి వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలు ఎంతోమంది హాజరయ్యారు.