బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 2023 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడని సంతోషంగా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.