టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్లలో కోమలి ప్రసాద్ ఒకరు. వైజాగ్‌కి చెందిన కోమలి డాక్టర్ చదివింది కానీ యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్‌తో హీరోయిన్‌గా మారింది. నేను సీతా దేవి అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి పదికిపైగా చిత్రాలు, వెబ్ సిరీస్ చేసింది. ముఖ్యంగా హిట్ సిరీస్‌లో కోమలి యాక్షన్, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఇప్పటివరకూ స్టార్ హీరోల పక్కన జోడీగా మాత్రం ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు.