తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి తొలి తరం హీరోలు కలిసి నటించారు. కానీ ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. బయట అందరూ బాగానే ఉంటారు కానీ, సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాత్రం ఫ్యాన్స్ ఒపీనియన్, స్టార్ డమ్ అంటూ లెక్కలు వేసుకుంటారు. అయితే చిరు - బాలయ్య లాంటి బాక్సాఫీస్ ప్రత్యర్థులు కలిసి ఒకే సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి
Chiranjeevi Balakrishna: చిరంజీవి - బాలకృష్ణ కాంబోలో మల్టీస్టారర్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రెడీ.. కథ కుదరాలి అంతే..
Published on: 23-08-2025