తిరుపతిలోని సుప్రసిద్ధ హాథిరాం బావాజీ మఠం భవనం కూల్చివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హాథిరాం బావాజీని తమ కులదైవంగా ఆరాధించే బంజారా, లంబాడీ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఈ చర్య ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు.
తిరుపతిలో అలా చేయటం సరికాదు.. మీ ప్రయత్నాలు విరమించుకోండి.. చంద్రబాబుకు MLC కవిత రిక్వెస్ట్
Published on: 23-08-2025