తెలంగాణకు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వానలు, హెచ్చరికలు జారీ

Published on: 23-08-2025

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేడు ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Sponsored