ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ఇచ్చింది.. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వాహనాలు నడపడంలో (హెవీ వెహికల్ డ్రైవింగ్) ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి జిల్లా నుండి పది మందిని ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులుదరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఎస్సీ యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ డిపో దగ్గర డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ ఇస్తారు.
ఏపీలో యువతకు బంపరాఫర్.. ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ, వెంటనే దరఖాస్తు చేస్కోండి
Published on: 23-08-2025