రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఎన్నో గొప్ప మాటలు విన్నాము. అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు దయనీయ స్థితిలో ఉన్నారు. వ్యవసాయం భారంగా మారింది.. కష్టపడి పండిస్తే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి భారం అవుతోంది. కూలీల ఖర్చులు, ఎరువుల ఖర్చులు వంటివి ఉన్నాయి. అయితే, పంట అమ్మేటప్పుడు సరైన ధర ఉండటం లేదు. దీనివల్ల పెట్టుబడికి, వచ్చే డబ్బుకు పొంతన ఉండటం లేదు. పంట మొదలు నుంచి చేతికి వచ్చే వరకు చాలా ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.